Sri suktha Rahasyardha pradeepika    Chapters   

హ్రీంశ్రీమాత్రే నమః

శ్రీసూక్తము

ప్రకట రహస్యార్థములు

1. ఓమ్‌ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజామ్‌|

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ అవహ||

(మమావహ).

శ్రీకాముఁడైన సాధకుఁడు, శ్రీరూపయైన మహాత్రిపురసుందరి సాన్నిధ్యమును గోరి, యగ్నినిఁ బిలు మనుచున్నాఁడు. ఎచ్చటనున్న యామెను బిలుమనుచున్నాఁడు? త్రిపాద్విభూతితో బ్రహ్మాండముల నిండియున్నట్టియు, ఏకపాదాం శాంశముతోఁ బిండాండమందుఁ గుండలినీపరాశక్తి రూపముతో నున్నట్టియు, బ్రహ్మాణీ, వైష్ణవీ, రుద్రాణీ, కాలీ, దురా, చండీ, శివేత్యాది నామములతో వ్యవహరింపఁబడునట్టియు, నా పరబ్రహ్మశక్తినే యా సౌభాగ్యలక్ష్మినే పిలుమనుచున్నాఁడు, స్తుతించుచున్నాఁడు. ప్రార్థించుచున్నాఁడు.

శ్రీసూక్తమంత్రములందు, సాధకుఁడు కొన్నింట శ్రీదేవిని నా కొఱకుఁ బిలుమని పరమేశ్వరరూపజాతవేదుని (అగ్నిని) నేడుచున్నాఁడు. కొన్నిఁట దానే పిలుచుచున్నాఁడు. కొన్నింట నుపాసనాసిద్ధులైన వారి తోడు గోరుచున్నాఁడు.

''తాను బిలుచుట యుక్తమే, కాని ''కరుణారససాగర'' (నామాధ్యాయము)యైన భగవతి యనుగ్రహమును గోరు వాని కితరుల ప్రాపేల'' యని మీరనవచ్చును. వినుఁడు ప్రతి నిత్యనైమిత్తిక కర్మముల నాచరించుటకఁబలుకు సంకల్పవాక్యములందు ''భగవదనుజ్ఞయా'' యనుట గలదు గదా. దాని వలన నీశ్వరానుగ్రహము లేక యే కార్యమును నిర్వఘ్నపరిసమాప్తీ నొందదని, ప్రధానాధిదైవతమును సాయము గోరుట సాధకధర్మము కావునను, ఉపాసనాసిద్ధులకును ఉపాస్యదేవతకును భేదము లేకుండుటచే, మంత్రసిద్ధులు మందత్రదుష్టలు మంత్రస్రష్టలు నైనవారి యాత్మబ్రసన్నతలు తన కార్యసిద్ధికిఁ దోడగునను విశ్వాసముతోడి యీయాచారమనాది సిద్ధము కానను, అటు చేయుచున్నఁడు. ఇంతేల? సదస్సులందు వేదగానమునకో యుపన్యాసములకో మఱి యేవిద్యా ప్రదర్శనమునకో కడంగు పండితులును, సభయందున్న పెద్దల నైపయి ''అనుజ్ఞ'' యనుట నిత్యముం గనుచున్నారము. ఇందులకే కాదా?

ఈ మొదటి బుక్కునందు జాతమేదుని (అగ్ని) సాయమన్నప్పుడు, బాహ్యముగా నాధానము చేయఁబడు వైది కాగ్నియా? యన్న, అంతర్యాగక్రమము నెఱుంగనట్టియు, దాని సాధించు సామర్థ్యము లేనట్టియు భక్తులకు, సమిధలచే రుగుల్పఁబడు వైదికాగ్నియే శరణము. ఉపసయనకాలము నుండియో, ఇటీవల సద్గురువులవలన శ్రీవిద్యోపదేశమొందిన నాఁటినుండియో, ప్రాణాయామాభ్యాసము, షట్చక్రజ్ఞానమును, మంత్రార్థ మననమును మేళవించి యుపాసించు సాధకులకుఁ గట్టెలతో రగుల్పఁబడు వైదికాగ్ని యపేక్షలేదు. వారపేక్షించి.

యాధానము చేయునది, పిండాండమందు (శరీరమందు) సర్వదా సిద్ధముగానుండు స్వాదిష్టానచక్రగత రుద్రరూపాగ్నియే

మఱి, దీని రగుల్చుటెటులందు రేని, - ప్రాణాయామ క్రియయందుఁ బూరింపఁబడి, కుంభింపబడెడి ప్రాణవాయువే, సర్వదేహమందును, సూక్ష్మసూక్ష్మతర సూక్ష్మతను ప్రోతస్సులందుఁ జొచ్చి సంచరించునపుడు, స్వాధిష్ఠానచక్ర (ఇది యగ్ని తత్త్వపూర్ణము) మందు సర్వసిద్ధముగానుండు రుద్రరూప జాత వేదుఁడు, కట్టెలు వీవనలు లేకె ప్రజ్వలించును. ఆ యగ్నిజ్వలనము వఱకే ప్రాణాయామసాధకుని ప్రయత్నము తప్పనిది. ఆ వెనుక వీని ప్రయత్న మక్కఱపడకయే, యాజ్వలితాగ్నిచే స్వాధిష్ఠానసమీపమందలిదేయైన, మణిపూర (ఇదిజలతత్త్వపూర్ణము) చక్రమందలి తేమ యాఱి పోవుటయు, ఆ దిగువ దేయైన మూలాధారకులకుండమందుండి, మణిపూరమందలి తేమచే సదా తనియుచుండు, కుండలినీపరాశక్తి కాతేమయందకపోఁగానే బస్సుమను చిన్న సీత్కారముతో లేచి, సుషుమ్నాంతర్గత సూక్ష్మతమమార్గమున నడ్డులేక మీదికిఁ బోవఁ గడఁగి, మేనాఁడునుఁ దేమ యాఱనిదియు, క్షీర సముద్ర, కైలాస, చంద్రమందల, హిమగిరి సంజ్ఞలతో నొప్పునదియు, నైన శిరోగత సహస్రారకమలము వైపు, మెఱుపువలె, బాణములెఁ బరుగెత్తును. అపుడె సుషుమ్నాబద్ధములైన వివధ చక్రములందు వివిధ కాంతులతోను, వివిధ నాదములతోను సాధకును కనుభూతయగును. ఇదియె కుండలిన్యుతా పనము. అనగా శ్రీదేవిని మేల్కొల్పి ప్రసన్నను జేసికొనుట.

ఈ ప్రయత్నము తొలుత సాధకుఁడు పది దినములు గురుసన్నిధినుంచి తెలిసికొనవలసినదే.

ఆచిచ్ఛక్తిస్వరూప శ్రీదేవియే శ్రీసూక్తమంత్రములతో సర్థింపఁబడి, వికిసించి, తన త్రిపాద్విభూతితోఁ గలిసి యనుగ్రహించి, వరములనిచ్చి ప్రోచునది. ఈ ప్రసన్నతకైన ప్రాణాయామ ప్రయత్నమందు, స్వాధిష్ఠానగత రుద్రరూపాగ్నియే తోడుపడువాఁడు గాన నాతనినే సాధకుఁడు తొలుతఁ బ్రార్థి చుచున్నాఁడు.

''అగ్నిస్తుష్టో యజమానాయ శ్రియం ప్రయచ్ఛతి'' అగ్ని సంతసించినవాఁడై యజమానునకు శ్రీ నిచ్చచున్నాఁడు. (శ్రుతి). ''అగ్నిర్నారాయణో భగవాన్‌'' అను శ్రుతిని బట్టి శ్రీదేవి భర్తయైన నారాయణుఁడే యీయగ్ని యని వైష్ణవులును, ''రుద్రో వా ఏష అగ్నిః'' అను శ్రుతిని బట్టి, మహా త్రిపురసుందరీ, ఉమా, పార్వతీ, దుర్గేత్యాది నామములతోఁ జెల్లు శ్రీదేవి భర్తయైన రుద్రుఁడే యీయగ్ని యని తదతరులును గైకొనుచున్నారు. సరమార్ధమున భేదమే లేదు. ''శ్రీశ్చతే లక్ష్మీశ్చపత్న్యౌ | హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ |'' అను రెండు పాఠములందునంగల హ్రీ శ్రీ శబ్దములకు గుఱియైనది, యా మహాత్రిపురసుందరియే. శ్రీదేవియే మత దురభిమానమున నెవ్వ రేయర్థము చెప్పుకొన్నను జాతవేదశ్శబ్దవాచ్యుఁడొక్కఁడే. శివుఁడో నారాయణుఁడో. శివనామములు విష్ణు నామములందును గలవు. విష్ణునామములు శివనామములందు నుంగలవు. పరమార్థ విచారణము చేసినపుడుపై శ్రుతులందలి రుద్రనారాయణు లొక్కరే. ఏ పేరఁ బిలిచినను బలుకు వాఁ డొక్కఁడే. కావునఁ బరమేశ్వర ననుగ్రహముచే నాతని చిచ్ఛక్తి విభూతియైన శ్రీదేవియు ననుగ్రహించు ననుట సిద్ధము.

ఇఁక మంత్రముల ప్రకటనగుప్తార్థములు చూచునపుడు మాటిమాటికిం గొన్ని విశేషాంశములు మీరు చూడఁగలరు. ప్రకటార్థము దండాన్వయమువలె వ్రాయఁబడినది. అనేకార్థములు గలచోట నంకెలు వేయఁబడినవి.

ప్రకటార్థముద

ఓ యగ్నిదేవుఁడా ! బంగారు వన్నెవంటి వన్నె గలదియు, 1. భక్తుల పాపములను హరించునదియు, 2. పచ్చని వన్నెగలదియు, 3. ఒకప్పుడు ఆఁడు లేడి రూపమును దాల్చి నిదియు, (దక్షాధ్వరధ్వంసకథ చూడుఁడు), బంగారు వెండి పూలదండలు (గొలుసులు) దాల్చినదియు, 1. వెన్నెలవెలఁ బ్రకాశించునదియు, 2. ఆహ్లాదపెట్టునదియు, బంగారు తన రూపముగాఁ గలదియునగు లక్ష్మీదేవిని నాకొఱకుఁ బిలుపుము. ఈ శ్రుత్యర్థ మెఱింగికొని రహాస్వార్థము బదువునది.

శ్రుతి :- ఉత్తిష్ఠత మాస్వస్త| అగ్నిమిచ్ఛధ్వం భారతాః రాజ్ఞః సోమస్య తృప్తాసః సూర్యేణ సయుజోషసః|| హేభారతాః=ఓభారతులారా! భా+రతాః=జ్యోతి రూపిణియయిన శ్రీవిద్య నుపాసించునాసక్తి కలవారలారా! ఉత్తిష్ఠత=లెండు, ఉపాసనమున కుపక్రమింపుఁడు. మాస్వస్త=నిదుర పోకుఁడు. అప్రమత్తులరగుఁడు. అగ్నిమిచ్ఛధ్వం=స్వాధిష్ఠానగతాగ్నిని ప్రజ్వలింపఁజేయుఁడు. రాజ్ఞః సోమస్య= ఉమతోఁగూడి ప్రకాశించుచు రంజింపఁజేయువాఁడైన (చంద్రమండలాంతర్గత (సహస్రారమందలి) బైందవస్థానమునొంది యుండుటచే సోమశబ్దపిద్ధి) అట్టి చంద్రుని (అమృత స్రావములచే) తృప్తాసః=తనిసినవారలు కండు, సూర్యేణ=అనాహత విశుద్ధచక్రమధ్యగత సూర్యునితో; సయుజా=కూడిన, రాజ్ఞా=రాజుచే తృప్తులరగుఁడు, ఉషసః=మాయమాక్లేశములు తొలఁగినవారై; లేక ఉషసః=ఉషఃకాలమందు ధ్యానరతులై, ఏమనఁగా ఉషఃకాలమే భగవతీ నిధిధ్యాసనాదులకు యోగ్యమైదని గాన, నపుడే పైని జెప్పినటుల ధ్యాసవిధిని నెఱపి యమృతపానమునఁ (సేచనమున) దనియుఁడు.

రహసార్థము

హే జాతవేదః=ఓ యగ్నిస్వరూప రుద్రఁడా! (పరమేశ్వరా!) వేదశ్శబ్దము అసుప్రత్యయాంతము. వేదవాచము. ''వేదాస్త్వదర్థం జాతాశ్చ జాతవేదాస్తతో హ్యసి'' మహాభారతము. గాన రుద్రుఁడే యనుఁడు. నారాయణుఁడే యనుఁడు. స్వాదిష్ఠానగత యజ్ఞపరుషుఁడే.

హిరణ్యవర్ణాం=1 బంగరు వన్నెవంటి గలట్టియు 2 ''హిరణ్యం విష్ణురాఖ్యాతం తస్స వర్ణస్తు వైష్ణవీ | లక్ష్మీర్హి రన్యవర్ణేతి శ్రూయతే కనకప్రభా||'' శ్రీపురాణము. హిరణ్యమనఁగా సర్వవ్యాపకుఁడైన విష్ణుఁడు. అతని వర్ణము. అనగా తేజస్సు లక్ష్మీదేవి, ''హిరణ్యవర్ణా'' యనఁబడినది. 3 మఱియు వర్ణము=ఆకారము అని అర్థము చెప్పి, పరమేశ్వరాకార, యనఁగా దదభిన్నయనియుఁ జెప్పికొనుఁడు.

హరిణీం = ఉపాసకుల పాపములను దారిద్య్రములను హరించుచునది. 2 పసుపువన్నె గలది.

సువర్ణరజతస్రజాం =1 బంగారు వెండి గొలుసులు ధరించినది. 2 వానివలెఁ బ్రకాశించునది., అనఁగాః బలువన్నెలతో వెల్గునది యని తోఁచునుగదా. ''తప్తస్వర్ణనవర్ణభ్యాం'' శ్రీపురాణము. పుటము పెట్టిన బంగారు, పసుపు నెఱుపును గల్గియుండును. వెండి తెల్లనిది. గాన నా గొలుసులు దాల్చిన దనఁగా, వాని కాంతులు గలది యనుట.

చంద్రాం =1 ఆహ్లాదపెట్టునది. 2 ''చది=ఆహ్లాదనే, రకి= దీప్తౌ'' అనుటవలన, ఆనందము, జ్ఞానము స్వరూపముగాఁ గలది. 3 వెన్నెలవలె శోభిల్లునది. చంద్రకాంతి-''చాంద్రీ చంద్రికా-చంద్రా'' యని సుశ్రుతము. 4 చంద్రమండలమందు (సహస్రారమందు) ధ్యానింపఁబడునది. ''అహమగ్నిశిరో నిష్ఠస్తం సోమశిరసిస్థితా| అగ్నీషోమాత్మకం విశ్వమావాభ్యాం సమధిష్ఠితం||'' శివపురాణము. నేనగ్ని శినస్సు సందుండువాఁడును, నీవు చంద్ర శిరస్సునందుండుదానవు; మన యిర్వురిచేతనే విశ్వము (బ్రహ్మాండమును పిందాండమును) అధిష్ఠింపఁబడినది. కావుననే సౌందర్యలహరియందు ''ప్రపంచంసించంతీ'' యను చోట లక్ష్మీధరాచర్యాదులు ఉపాసకుని 72 వేల నాడులను అమృతముతోఁదడుపునది, యని వ్రాసిరి. ఇపుడు జాత వేదుఁడన స్వాదిష్ఠానగతాగ్ని స్వరూప శివుఁడనియు, చంద్రమండల మందుండునది యన్నను, దత్స్వరూపిణియన్నను సహస్రారమం దమృతవర్షిణియగు పరాశక్తియనియు రాహస్యము.

హిరణ్మయీం=శివశక్తిని ''హిరణ్యరేతసః శంభోః శక్తిః ప్రోక్తా హరిణ్మయీ | ధనార్ధిరుపాసై#్యషా జాతవేదసి సర్వదా||'' శ్రీపురాణము. తేజస్సే వీర్యముగాఁగల శివుని శక్తియే హిరణ్మయి. ధనకాములు (ప్రియతమవస్తువును గోరువారు) మర్త్యులకుఁ బ్రియతమనవస్తువు ముక్తియే గానఁ దానిని గోరువారు, జాతవేదునందు (పరమశివునందు)=స్వాధిష్ఠాన గతాగ్నియం దుపాసింపవలయును.

అయ్యా! శివక్తియైన ఉమనే లక్ష్మిగాఁ బల్కుటయుక్తమా యందు రేని, - ''లలితా శారదా లక్ష్మీరేక్తేన భగవత్యుమా | తత్తల్లక్షణసంయుక్తాపురుషార్థప్రదానృణాం||'' అను దేవీపురాణోక్తిని బట్టి, లలితా, శారదా, లక్ష్మీనామములతో నొప్పునది శివశక్తియైన శ్రీ మహాత్రిపురసుందరియే ఆయా లక్షణములతోఁ గూడినదై యుపాసకుల కాయాయి పురుషార్థముల నిచ్చును. త్రిపురసుందరి యనుపదమున కెన్ని విధములుగానో లక్ష్మియను నర్థము చెప్పవచ్చునైనను బ్రకృతార్థము,- త్రిపురములు= బ్రహ్మవిష్ణు శివశరీరములు ఎవని యందున్నవో యతఁడు త్రిపురుఁడు. పరమశివుఁడు అతని సుందరి, మహాత్రిపురసుందరి. అంతయు శ్రీమాతయే. ''జ్ఞానమాత్మని భాసూర్యే చంద్రే జ్యోత్స్నా చ ఖే ధ్వనిః| వర్ణో హిరణ్య పయసి ఘృతం త్యమసి మాతృకే||'' మాతృకాస్తుతి. ఆత్మయందు జ్ఞానము, సూర్యునందు వెల్గు, చంద్రునందు వెన్నెల, ఆకసమందు ధ్వని, బంగారునందు వన్నె, పాలయందు నేయియు తల్లీ! నీవే చుమా'' అనఁగా,- నీవే జ్ఞానస్వరూపిణివి; సూర్యమండలమనెడి యనాహతచక్రమందలి తేజస్సునీవే; ఆజ్ఞాది సహస్రారాంతమైన చంద్రమండలమందలి కాంతి నీవే: హృదయాకాశమందు శ్రవణాకాశిమందు గోచరించు వీణావేణు మృదంగాదిశబ్దము నీవే; లేదా అకారాది క్షకారాంతమై వైఖరీవాగ్రూపమునఁ జెవికి గోచరించు ధ్వని నీవే; హిరణ్యమందు వర్ణము అనునపుడు సర్వవ్యాపక పరమేశ్వర శక్తిని నీవే యని పైనే వివరింపఁబడ్డది. శక్తిని నీవే యనిపైనే వివరింపఁబడ్డది. క్షీరసముద్రమనఁబడు సహస్రారమునందుఁ బుట్టు ఘృతమనెడి యమృతము నీవే; యని రహస్వార్థము. ''ఘృతంమిమిక్షి రేఘృతమస్య యోనిః ఘృతే శ్రితో ఘృతమవశ్యధామ'' అను నపుడును బరమార్థమిదియే.

ఇపుడు నీ చెప్పినదాన రహస్వార్థమేమున్న దనినఁ- జూడుఁడు,- ఒక్క లక్ష్మీవ్యక్తియే యెన్నోవర్ణములు గలదిగా వర్ణింపఁబడుట యసంభవము. దానిచే మన మూహింపఁ దగిన దేమైయుండును? ఒకప్పుడొక చోట నొక వన్నెతోను, వేఱొకప్పుడు వేఱొకచోట వేఱొక వన్నెతో శోభిల్లుచుండునని చెప్పుటకే యీ వర్ణన మనక తప్పదు. సాధకుఁడు పరమేశ్వరుననుజ్ఞాసహాయములు గొని ప్రాణాయానుక్రియఁకుబూనుకొని వాయుకుంభనము చేయఁగా శ్రీదేవి మూలకుహరమును వీడి సహస్రారముకుఁ బ్రయాణము చేయునపుడు సుషుమ్నా మార్గమున వివిధ చక్రములయందు వివిధ వర్ణములతోఁ గాన వచ్చును. బుటము వెట్టిన బంగారువలెను, ఎఱుపు, తెలుపు, గలిసిన మెఱుముల మొత్తమువలెను, ఆజ్ఞాది సహస్రారాంతమువఱకైన చంద్రమండలమందుఁ జంద్రునివలెను, శ్రీదేవీకాంతుల ననుభవించు రహస్యమే యిది.

ఇదె సౌభాగ్యవిద్యాహృదయమందు.-

''యోనౌ కనకపుంజాభం హృది విద్యుచ్చయోజ్జ్వలమ్‌|

అజ్ఞాయాం చంద్రసంకాశం మహస్తవ మహేశ్వరి||

ఓ సౌభాగ్యలక్ష్మీ! నీ తేజస్సు ములాధారమందు బంగారు ముద్దసొంపును, అనాహతమందు మెఱుపుల మొత్తపు మిలమిల శోభను, ఆజ్ఞాచక్రమునఁ జంద్రుని తేజును గల్గి యుండును. అనెడి యీ యోగానుభవమే గదా యీ బుక్కునం దిమిడి యున్నది?

దిగువనున్న యాగ్నేయ మండలమునుండి పుటము పెట్టిన బంగారు కాంతులవంటి కాంతులు మీదికి వ్యాపించుచుండఁగా అనాహతమనెడి (హృదయము) సూర్యమండలము నుండి సూర్యకాంతులవంటి పలుతేజస్సులు క్రిందుమీదులకు వ్యాపించుచుండఁగా, అజ్ఞాదిసహస్రారాంతమైన చంద్రమండలమునుండి వెన్నెలవంటి జిగులు క్రిందికి వ్యాపించుచుచుండఁగా, వినియన్ని యుంగలిసి హృదయముందుఁ జిత్రముగా మెఱుపుల మొత్తపు మిలమిలవలె నుపాసకునకు గోచరించుటయే శ్రీదేవి బంగారు వెండి గొలుసులను దాల్చినది (అనఁగా ఆ శోభను వహించినది) యను వర్ణమును.

ఇచటఁ జదునరులు సాధకులై యించుకంత షట్చక్రవివేకముఁ బ్రాణాయామాభ్యాసముఁ గలవారైనపుడే నాయీవాత్రలు నచ్చి యానందావహములగును. పరమేశ్వరి శ్రీసూక్తజపనిరతులగు పాఠకులలోఁ గొందఱికేని యీ యానందముఁ గొలదికాలముననే కలిగించుగాఁక. అదిలేకయే భారతలోకము మొదలికిఁ జెడినది. చెడుచున్నది, ఇంతేగాదు; భగవద్వస్తువును స్త్రీ రూపముగానో, పుంరూపముగానో ఆయా మంత్రజాపముతో నుపాసించునప్పుడు, మంత్రబీజములను అర్థజ్ఞానముతోఁ జక్రములందు విన్యసించు కొనుటయు, మంత్రి మంత్రి మంత్రిదేవతల కభేదమనెడి దృఢభావమును దక్కు నియమము లన్నిటికంటెను ముఖ్యములు. వాయుకుంభన కౌశలముతో నివి చేర్చి జపించుట సమగ్రఫలదము. అటుగాక కేవలోచ్ఛారణ మాత్రపామేయైనచో భక్తిమాత్ర జన్యాల్పఫలమునే చిరమున కందఁగలఁడు. పక్షికి గగనసంచారమునరెండు ఱక్కలుందోఁకము నెట్లు తోడ్పడు నటులే సాధకుం సిద్ధికిఁబై మూడునుఁదోడ్పుడును. నివేదనమున వివరించితిని జూడుఁడు.

శ్రీదేవి రహోయాగక్రమారాధ్య కావునఁ బైని వివరించినటు లాంతరోపాసనముం జేపినపుడు, పిండాండమున సంశరూప జీవాత్మ చిచ్ఛక్తి వికాసము నొందఁగానే బ్రహ్మాండపూర్ణమై యున్న యామె త్రిపాద్విభూతియు వచ్చి, చేరును. అదియే భగవదనుగ్రహమందురు.

కొంతఱంత జపముచేసినను, ఎన్ని మ్రొక్కులు మ్రొక్కినను భగవదనుగ్రహము కలుగకున్నదని వగతురు. భగవదనుగ్రహమన నెట్టిదో తెలిసి చేసి దానిని సంపాదించుకొనఁగ గల్గు వారలార్తివేళ నిటు వగచుపని యుండదు. ప్రారబ్ధవశమునఁ బాపప్రతిబంధములున్నను దాని బలమును వేగమును సడలిపోయి సుఖింపఁగలదరు. అటులైనపుడు ప్రకట గాయత్రియే కానిండు; గుప్తగాయత్రియే కానిండు; సాధకుని యుపాసనము పితృభావముతో కానిండు; మాతృభావముతోనే కానిండు; ఆ యన్యాజకరుణామూర్తి శక్తి యనుగ్రహించి సర్వసిద్ధులనుఁ బ్రసాదించి తన గాయత్రీ నామము నన్వర్థము జేసికొనక పోదు.

''అనాన్యశ్చింతయంతో మాం యే జనాఃపర్యుపాసతే

తేషాంనిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌''

గీతాస్మరణము. అనున్యాః అన్నచోట, దేవా! నీకును నాకును వేఱులేదను మహావాక్యబోధముతో ననుటయే. అబులు నిత్యము ననుసంధానముచేయు జీవులకుఁ గావలసిన వన్నియు నేనిత్తును. ఇచ్చినదానిఁ జెడకుండఁ గాపాడుదునని భగవంతుని ప్రతిజ్ఞ.

ఈ సక్రమోపాస్తి యుపనయన కాలమునుండియే యుపదేసింపఁబడ వలసినది. దుష్కాల మహిమచే నదియు పేక్షింపఁ బడుటనే మంత్రో పాసన మహిమమువలని త్రాణము లేకున్నది. అభిమతార్థసిద్ధి కానున్నది. కాకపోఁగా నజ్ఞానముచే నాత్మాపరాధమని యెఱుంగమిని నాస్తిక్యమే నాటుకొనుచు మఱింత దౌర్గత్యము ఫలమగుచున్నది.

విచారణపరిశ్రమలు లేకుంటచే ''శ్రీవిద్య'' యన బ్రహ్మవిద్యయను మాటయుం దెలియకపోయె. తెలియనిసాహసికుల యోటుమాటల వలనను వ్రాతలవలనను శబ్దస్వరూనమును మఱుంగయి 'స్త్రీవిద్య' యను నపభ్రంశరూపము వ్యవహారమునకు వచ్చినది.

''భగవద్గీతో పన్యాసములు'' అను నొక గ్రంథము వ్రాసిన యొక సన్యాసి, యిటులే తెలియక, తన గ్రంథమందు ''స్త్రీ విద్యబహు ప్రమాదముతోడిదనియు, స్త్రీలకు స్త్రీవిద్య, పురుషులకుఁ ఋరుషవిద్యయనియు, స్త్రీవిద్యనవలంబించినవారనేకులు చెడిరనియు, నిటులెన్నియో, వినరానిమాటలు వ్రాసి యుపన్యసించెను. అది వినిన నేనుబోయి, ''స్వామీ! గాయత్రీ మంత్రార్థమును, ఆవాహనోపస్థానమంత్రార్థములును సెలవిం''డని కోరితిని, ''నాకు సంస్కృతము రాదు, నేనెఱుఁగను. ఆంగ్లమునఁ బలువురు వ్రాసిన గీతావ్యాసములను జూచి తెనుఁగు వ్రాసికొని దేశముమీదఁబడితిని. నారాయణ!'' యున్నాఁడు. సన్యాసికి నియమతమైన ప్రణవానునంధానముఁగూర్చి ముచ్చటించినను ''తెతైతె-పెప్పెపె'' యన్నాఁడు. ఇంకేమిచెప్ప? వ్యాసపూర్ణిమనాఁడు తాంజేయవలసిన శ్రీమంత్రపూజ యందు శ్రీచక్రాంతరతమ త్రికోణబిందులేఖన క్రమమును నాతఁడెఱుంగఁడు. మన నియతో పాసనకాండము చెడుటకిట్టివెన్నియో కారణములున్నవి. అది యుండనిండు.

వీర్యవంతములైన మోషధులను నిర్దిష్టకాలమున నుద్ధిరించి తెచ్చి శాస్త్రోక్తములైన యితరద్రవ్యములతో యోగము చేసి, క్రమసిద్ధము చేనిపుడు, వానియందున్న పరమేశ్వరప్రత్యక్షశక్తి, మహౌషధమై, రోగనిర్మూలనసమర్థమెటులగుచున్నదో, యట్లే యాభగవానుఁడు క్రమోపాసితుఁడైనపుడు, సర్వసిద్ధులను భుక్తిముక్తుల నీయకుండునా?

2. ఓమ్‌ తాం మ అవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం|

యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం

పురుషానహమ్‌||

ఓయగ్నిదేవుఁడా! (నారాయణుఁడా!) నిన్నేనాఁడు నెడసియుండని, సర్వలక్షణసంపన్నయైన లక్ష్మీ పిలువఁబడఁగా, నేను సువర్ణమును, గోవులను, గుఱ్ఱములను, పుత్రమిత్రదాసాదులను, బొందఁగలను, గాన నామెను బిలువుము.

రహస్యార్థము

హే జాతవేదః = ఓపరమేశ్వరుఁడా! తాం=1. పైని జెప్పిన లక్షణములతో సుప్రసిద్ధయైనదియు; 2. తత్‌ పదము బ్రహ్మనిర్దేశము. స్త్రీ లింగమున ద్వితీయైకవచనము 'తాం'= అబ్రహ్మవస్తువే యైనదియు; లక్ష్మీం= 1. నీతిశాలురను లక్షించునదియు, 2. యోగులచే లక్షింపబడునదియు; అన పాయినీం 1. ఏనాడును నిన్ను విడి యుండనిదియు, ''స్వాభావికీ జ్ఞానబలక్రయాచ'' అను స్మరణముచే, స్వభావముచే నీతోనే యుండి ఇచ్ఛాజ్ఞానక్రియోశక్తి రూపమై యుండు నదియు, నైన యామెను; మే+అవహ=నా ప్రయోజనమునకై పిలుపుము. యస్యాం (అహుతాయాంసత్యాం)=ఏమె యాకర్షిఁపబడినది కాఁగా; అహం=నేను, హరిణ్యం=1. తేజస్సును 2. హిరణ్యం విష్ణురాఖ్యాతం'' అను మాటచే, హిరణ్య రూపుఁడైన, హిరణ్యపదవాచ్యుడవైన నిన్నును:

గాం=1, వాగ్వికాసమును (దేవియే పరాపశ్యంతీ మధ్యమావైఖరీ వాగ్రూపయై పిండాండమందుఁ గ్రీడించు చుండును); స్వర్గెషుపశువాగ్వ జ్రదిజ్నే త్రఘృణిభుజలే... గౌః '' అమరకోశము'' గాన నుపయుక్తమగు నేయర్థమునైన నిటగోశబ్దమునకుఁ దీనికొన నగును. 2. సహస్రారమందలి చంద్రుని. 3. చంద్రసూర్యలోకములను 4. స్వర్గమును;

అశ్వం=ఇంద్రియమును (ఇంద్రియపాటమును) ఇంద్రియములు గుఱ్ఱములుగా నెన్నఁబడుట విద్యారణ్యాదుల భాష్యములందును విదితము. ''ఋజుకాయశిరోధరోయతాత్మా విషయేభ్యో వినినర్తితేంద్రియాశ్యః'' త్రిపురాసారము.

పురుషాన్‌=అంతఃకరణములను, అనఁగా అంతఃకరణ శద్ధిని; ఇదియు భగవంతుఁడీయవలసినదే. ''విదధతు విపు లాం శుద్ధబుద్ధిం శివో నః|'' ''స్వస్థైఃస్మృతా మతిమతీన శుభాం దదాసి'' అని స్మరణము. శ్రీవిద్యారణ్యుల పురుష సూక్తభాష్యమున నీయర్థము చూచునది. విందేయం=పొందుదును.

భావము:- స్వాధిష్ఠాన జాతవేదోరూపుఁడనైన నీవు నాప్రాణా యామప్రక్రియమందుఁ తోడ్పడి, నీన్నేనాఁడును విడియుండని యామహా త్రిపురసుందరిని నాకొఱకాకర్షింపుము. నీశక్తియేయైన ఆమెవలన, తేజస్సు, వాగ్వికాసము, ఇంద్రియబలము, అంతఃకరణశుద్ధి, తుదకు నిన్నునుంబొందుఁగలను. గాన నీతిశాలుర లక్షించు లక్ష్మీని బిలుమని ప్రార్థించుచున్నాడు.

3. ఓమ్‌ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద

ప్రబోధినీమ్‌|

శ్రియం దేవీముపహ్యయే శ్రీర్మా దేవీ జుషతమ్‌||

ప్రకటార్థము

(ఇందు సాధకుఁడు శ్రీదేవిని తానే చనవునఁ

బిల్చుచున్నాఁడు)

గుఱ్ణములు ముందుగలట్టియు, రథముల నడుమ నున్నట్టియు ఏనుగుల ధ్వనియే మేల్కొనునట్టియు, క్రీడాదిలక్షణ శీలము. ఆశ్రయింపఁదగినదియునైన లక్ష్మీదేవిని బిల్చుచున్నాను. ఆశ్రీమాత నన్ను బ్రేమాస్పదునిం జేయుఁగాక.

రహస్వార్థము

ఇటునటు వ్యాపించు స్వభావముగల యింద్రియములు ముందుగా గలదియు; అనఁగా ఆత్మశక్తిస్వరూపయై తాను వెనుకనుండి యింద్రియములచేఁబని చేయుఁచునిదియుననుట (సర్వేంద్రియాధిష్ఠాత్రి).

రథమధ్యాం శరీరములందాత్మరూపమున నుండు నదియు; ''రథం శరీరమిత్యాహురాత్మానం రథినం విదుః'' అని స్మరణము. ''రథస్థం మాధవం దృష్ట్యా పునర్జన్మ విద్యతే'' శరీరమందున్న లక్ష్మీనాథుని (పరవేశ్వరుని) ధ్యానయోగమనఁ జూచువారికి మఱిజన్మము లేదు. అనునపుడు రథోత్సమందు రథముపై నుంచఁబడిన విష్ణుప్రతీకము మాట కాదిది.

హస్తినాదప్రబోధినీం=1. హస్తము=తోలుతిత్తి; హస్తినాదమనఁగా తోలుతిత్తియూదునప్పటి బస్సుమను ధ్వనివంటి ధ్వనితో మేల్కొనునది. 2. సప్తస్వరములలో ''ని'' యనునది నిషాదము; ''నిసాదం బృహంతేగజః'' ఇది హస్తినాదము. సాధకుఁడు కుంభకస్థితియందు నిల్చి, యింద్రియ విక్షేప మడంచినపుడు, వెనుక వివరింపబడినటులు కుండలినీ పరాశక్తి స్వస్థానమును వీడి సుషున్ను దారిని లేచునపుడు బస్సుమను ధ్వనితో లేచునని యోగానుభవము. ఆపైని జక్రాంతరములను దాటి పోవునపుడు (అనాహతాదిగా, బైభాగమందే) వీణ, వేణువు, మృదంగము, కంచుతాళము, ఏనుఁగుధ్వని మున్నగు నెన్నో నాదములు మోగులనుభవింతురు. గాన నీరెండర్థములను సమంజసములే.

దేవీం=1. ప్రకాశనశీలయు; 2. సుషుమ్నామార్గ క్రీడనశీలయు; 3. శ్రీరాజరాజేశ్వరియు; శ్రియం=1. ఆశ్రయింపఁదగినదియు; 2. జ్ఞానానంద స్వరూపిణియు; నైన శ్రీదేవిని బిలుచున్నాను, శ్రీః+మా+జుషతాం= ఆశ్రీమాత నన్నుఁ బ్రేమాస్పదుని జేయుఁగాక.

ఓ మహాత్రిపురసుందరీ! శరీరమందుండి యింద్రియము లచేంబనిచేయించుదానవునీవు, నా ప్రాణాయామ ప్రత్నముచే మేలుకొని తోలుతిత్తియొక్క బస్సుమను ధ్వనివంటి ధ్వనితో లేచి, సుషుమ్నార్గమున కెగఁబడి పోవుచు నొకచోట సప్తస్వరములలో నిషాదస్వరమువంటి ధ్వని చేయుదువు. జ్ఞానానందస్వరూపిణివై; స్వయంప్రకాశ##వై యొప్పు రాజరాజేశ్వరిని, అట్టి శ్రీశబ్దవాచ్యను నన్నుఁ బ్రార్థించుచున్నాను. లెమ్ము. రమ్ము. నాకును నట్టి యోగానుభవములు ప్రసాదించి కృతార్థునిఁచేయుమను చున్నాఁడు.

4. ఓమ్‌ కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం

జ్వలంతీమ్‌|

తృప్తాం తర్పయంతీం పద్మేస్థితాం

పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం||

ప్రకటార్థము

కాం=ఇట్టిదట్టిదని చెప్పు మనోవాక్కులకందనట్టియు ''యతోవాచో నివర్తంతే అప్రాప్యమనసా,సహ'' (శ్రుతి.) ఇంచుకంత చిఱునవ్వుతో గూడినట్టియు, బంగారుటావరణములు గలట్టియు; (క్షీరసముద్రమునఁ బుట్టినదానవగుటచేఁ దడిసినట్టియు, శీతలస్వభావము గలట్టియు,) ఆర్ద్రానక్షత్రమునఁ బుట్టినట్టియు, ప్రకాశించునట్టియు, పూర్ణకామవైనట్టియు, భక్తులకోర్కు లీడేర్చి తనుపునట్టియు, పద్మమందుఁ గూరు చున్నట్టియు, పద్మచ్ఛాయగలట్టియు శ్రీదేవిని నిన్నుఁ బిలుచుచున్నాను.

కాం=1. ఇట్టిదట్టిదని చెప్పనలవికానిదియు, (అనఁగా యోగులకేగాని తదితరులకు దుర్నిరూపస్వరూపయు)2. ''కితి బ్రహ్మణో నామ కా తచ్ఛ క్తిరుదీర్యతే'' అను స్మరణముచే బ్రహ్మశక్తియని, సరస్వతి యనియు నర్థము; సొస్మితాం=ఉత్కృష్టమైన మందహాసముగలది (యనఁగా నానంద స్వరూపిణియు; హిరణ్య ప్రాకారాం=1. కాంతిమండలములు గలదియు, 2. బంగారువంటి యుత్కృష్టమైన వర్ణము గలదియు. 3. ''హిరణ్యం విష్ణురాఖ్యాతం'' అను స్మరణముచే, బ్రహ్మముయొక్క ప్రకృష్టమైన యాకారమే యైనదియుఁ. (అనగా బ్రహ్మస్వరూపిణి యైనదియు).

ఆర్ద్రాం=1. ప్రేమరసముచేఁ దడుపబడినదియు, 2. రుద్రరూపిణి యైనట్టియు, (ఇపుడు రుద్రశబ్దము మూర్థన్య స్వరాది) ''ఆర్ద్రయా రుద్రః ప్రథమాన ఏతి'' అని దర్శనము;

జ్వలంతీం=ప్రకాశించునట్టియు; తృప్తాం=తనిసినట్టియు (క్షీరాబ్ధిగా భావింపఁబడు సహస్రార చంద్రమండలమును జేరి తనసినది). కావుననే శివసమాగమమును గోరి శివస్థానమైన సహస్రారమును జేరిన పూర్ణాకామ. ''నిత్యతృప్తా భక్తనిధిః'' నామస్మరణము.

తర్పయంతీం-సాధకుని నాడీమండలమును చంద్రమండలముగా నెన్నఁబడు సహస్రారము నుండి యమృతమును (ఆనందరసము) స్రవింపజేసి తడిపి తనియించునదియు (అనఁగా సాధకుని పరానందానుభూతి నొందించునట్టియు; (ఇపుడే అమృతేశ్వరి) పద్మే+స్థితాం=సహస్రారపద్మమందున్నట్టియు పద్మవర్ణాం=కమలకాంతి గలట్టియు, (సహస్రారమెప్పుడును యోగులచేఁ దెల్లతామర (పుండరీకము) గానే వర్ణింపబడుటచేఁ దెల్లతామర వన్నెతో శోభిల్లునట్టియు; తాం=1. సుప్రసిద్ధయైనట్టియు; 2. తశ్ఛబ్దము పరబ్రహ్మవాచి, కావున పరబ్రహ్మస్వరూపిణియైనట్టియు; శ్రీనామకయైన జ్ఞానానందస్వరూపిణిని బిలుచుచున్నాను.

భావము:- శ్రీదేవీ! అవాఙ్మానసగోచరవు రహో యాగనిపుణులకేగాని యితరులకిట్టిదని చెప్పనలవి కాని దానవు; నాదబ్రహ్మస్వరూపిణివై పిండాండమున పశ్యంతీ మధ్యమా వైఖరీరూప వాక్స్వరూపవైన పరాశక్తిని, ఆనందాకారపు; కాంతిమండలములు గలదానవు. బ్రహ్మము కంటెను వేఱు కాని తచ్ఛక్తిని; రుద్రశక్తిస్వరూపిణివి; క్షీరాబ్దిగా నన్నఁబడు సహస్రారనముఁజేరి తనియుదువు; నీయుపాసకుని శరీరమును ఆనందామృతమునఁ దడిపి తనియించు అమృతేశ్వరివి. అపుడు తెల్లతామరవన్నెతో నొప్పుదువు; పూర్ణ కామవు. అట్టి నిన్ను ననుఁగరుణింపఁ బిలుచుచున్నాను.

(ఈబుక్కునందు శ్రీవిద్యాసమయాచార మందు త్తీర్ణుఁడైన వాని యు త్తమానుభవములు సూచింపఁబడినవి.)

5. ఓమ్‌ చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం

శ్రియం లోకే దేవ జుష్టాముదారాం

తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే

అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణ||

ప్రకటార్థము

చంద్రునివలెఁ బ్రకాశించునట్టియు (ఆనంద పెట్టునట్టియు), అధికమైన కాంతులు గలట్టియు, కీర్తితో వెలయునట్టియు, (భక్తులను సంపదాదుల నిచ్చుటచేనైన కీర్తితో ననుట) ఇంద్రాదిదేవతలచే సేవింపఁబడునట్టియు, దాతృత్వ మహత్వము గలట్టియు; చేతఁగమలములు దాల్చినట్టియు; ఈం' అనునక్షరముచేఁ జెప్పఁబడునట్టియు; (ఈం లక్ష్మీ బీజము) శ్రీదేవీ! నేనీలోకమున నిన్నే శరణుజొచ్చుచున్నాను. నాదౌర్భాగ్యము నశించుఁగాక, అందులకై నిన్నే కోరుచున్నాను.

రహస్వార్థము

చంద్రాం=(అజ్ఞాదిసహస్రారాంతము) 1. వెన్నెలవంటి కాంతితోఁ వెల్గునట్టియు; 2. జ్ఞానానందాకారవై యాహ్లాదపెట్టునట్టియు; ప్రభాసాం 1. మిగులఁ బ్రకాశించునట్టియు; 2. యశసా+జ్వలంతీం=కీర్తిచే శోభించునట్టియు - లేదా - ప్రభాసాం+ యశసా +జ్వలం తీం= ఉత్కృష్టమన కాంతుల వ్యాప్తిచే వెత్గునట్టియు ;-లేదా-ప్రభాసాం +యశసా+జ్వలంతీం=కాంతిగలవానిలోఁ గీర్తిచేఁ బ్రకాశించునట్టియు; (సూర్యచంద్ర, నక్షత్రాదులైన ప్రకాశమానవస్తువులను దనకాంతిచేఁ బ్రకాశింపఁజేయునను కీర్తిగలట్టియు) దేవజుష్టాం=1. ఇంద్రుఁడు, అగ్ని, శివుఁడు, విష్ణువు, బ్రహ్మ, మన్మథుఁడు, కుమారస్వామి మున్నగు దేవతలచే నుపాసింపఁబడినట్టియు,

''అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి'' సౌందర్యలహరి - లేదా 2. వాయువుచే సేవింపఁ బడినట్టియు (ప్రీతయైనట్టియు) (శ్రీవిద్యారణ్య పురుషసూక్తభాష్యమున, దేవపదమునకు, ఇంద్రాది దేవతలు, వాయువు, ఇంద్రియములు, స్వయంప్రకాశపరమాత్మ, యను నర్థములందు విని యోగుముఁ జూచునది): త్రిపురాసారసముచ్చయమున ''తుషా రాంశునాడీం ప్రపన్నేతుదేవి'' వాయువు, ఇడానాడియందుఁ బ్రసరించువాఁడు కాఁగా, అని యర్థము. 3. ప్రత్యక్చితిరూప ముగాఁ పిండాండమందుండి యింద్రియములు సాధనములుగా రసముల ననుభవించునది. 4. ''సంవిద్దేవ్యః సమాక్రమ్య విషయానమృతాసవం| యోగినాం ప్రేషయంత్యార్యే త్వత్పూ జార్థం హి సర్వదా'' అను సౌభాగ్యహృధయ స్మరణముచే యోగుల యింద్రియములను దత్తదధిష్ఠానదేవత లాక్రమించి సహస్రారమందలి యాసవమును (అమృతమును) తల్లీ! నీపూజ కొఱకే పంపుచున్నారు. అనఁగా సంవిద్దేవతలు నీప్రాపుగొన్న సాధకుని యింద్రియ విక్షేపమడంపఁగా నీవడ్డులేక సహస్రారమును జేరి యమృతస్వరూపవగుచున్నావు'' గావున దేవజుష్టవనుట నీకుఁజెల్లును.

ఉదారాం=1. మిగులఁ జక్కనిదానవు. 2. ఈవికి వెనుదీయని దానవు. (ఉపాసకులకు భుక్తిముక్తులనిచ్చు నట్టిది) 3. నీస్వరూపమును దెల్పు శ్రీచక్రమున అధోముఖకోణములు గల దానవు.

పద్మినీం=సుషుమ్నా సంచారవేళ మణిపూరాదిపద్మ సంబంధనముచేఁ దామరలతవలె వెలయుదానవు.

ఈం=ఈం బీజవాచ్యవు, ఈం బీజోపాస్యవు. ఈం బీజరుపవు, లక్ష్మీసరస్వతీరూపవు. ''కారోబ్జదళే లక్ష్మ్యాం వాణ్యాం కమలకేసరే'' రత్నమాలాభిధానము. 4. కామకళా స్వరూపిణివి; తాం=బ్రహ్మాకారవై ప్రసిద్ధురాలవైన, త్వాం వృణ=నిన్నె కోరుచున్నాను.

మే అలక్ష్మీః సశ్యతాం=నా దౌర్భాగ్యము (కామక్రోధాదులకు లోగుట మున్నగు సవగుణసముదాయమును, సకలదారిద్య్రములును) నశించుఁగాక.

భావము :- మూలాధారమున సర్పమువలెఁ జుట్టుకొని యుండి, సాధక ప్రయత్నముచే బాణమువలె సుషుమ్నయం దెగఁబడిపోవుచు, అందలి చక్రములు గ్రంథులు ననెడి పద్మ సంబంధముచేఁ దామరలతవలె శోభిల్లుచు, గ్రమముగా సహస్రారమును జేసిరి, వెన్నెలవంటి కాంతులను వెదజల్లు జ్ఞానా నందస్వరూపిణి శ్రీదేవియే; సర్వేంద్రియ విషయసుఖములను భవించునది యామెయే, ఇంద్రియాది దేవతాస్వరూపిణియై సాధకుని యింద్రియవిక్షేపమడంచి కరుణించి, సహస్రారమును జేరి యుపాసకు నానందామృతమున నోలలాడించునది శ్రీదేవియే; భక్తమనోరథములను గొదువలేక తీర్చి ముక్తి నిచ్చునది శ్రీదేవియే; సూర్యచంద్రాది మండలములఁ బ్రకాశింపఁజేయునది (పిండాండమందలి అగ్ని సూర్య సోమమండలములను బ్రకాశింపఁజేయునది) మహాత్రిపురసుందరియే; హరిహరేంద్ర ముఖ్యదేవతలచేఁ బంచదశాక్షరీవిద్యతో నుపాసింపఁబడినది యామెయే, తన యాకారమేయైన శ్రీచక్రమందున్ముఖకోణములతో శోభిల్లునది శ్రీమహాత్రిపురసుందరియే; ఆశ్రీచక్రబిందు స్థానమున ఈం బీజముతో నుపాసింపఁబడునది యా శ్రీదేవియే; ఈంకార వాచ్యయైన లక్ష్మియై సకలసంపదలను, సరస్వతియై సకలవిద్యలను భక్తులకిచ్చునది యాదేవియే,; ('ఈం' గుప్తమహాసారస్వతబీజము) ఆయమ్మనేనా దౌర్గత్యమడంగుట కాశ్రయించుచున్నాను. అను నీ స్తుతి రూపవర్ణనమునందు, స్థూలసూక్ష్మపారోపసనములెటులు గుప్తములో చూచితిరా?

6. ఓమ్‌ ఆదిత్యవర్ణేతపసో7ధిజాతో

వనస్పతిస్తవ వృక్షో7థబిల్వః|

తస్య ఫలాని తపసా నుదంతు

మా యాంతరా యాశ్చ బాహ్యా అలక్ష్మీః||

ప్రకటార్థము

సూర్యకాంతివంటి కాంతిగల శ్రీదేవి! నీతపస్సువలన (పూలులేకయే ఫలించు) మీరేడు చెట్టుపుట్టినది. (పార్వతియంశముతో జమ్మింయు, లక్ష్మియంశముతో మారేడును బుట్టినవని- వామనపురాణము) దాని ఫలములు నీయనుగ్రహముచే, అంతరింద్రియసంబంధములైన మా యాజ్ఞానతత్కార్యములై నట్టియు, బహిరింద్రియతత్కార్యములైనట్టియు దుర్గతులను (పాపాదిరూపములను దారిద్ర్యాదిరూపములును అయిన అలక్ష్ములను) బోఁగొట్టుఁగాక.

రహస్యార్థము

ఆదిత్యపర్ణే=సూర్యకాంతినంటి కాంతిగలదానా! 2. విష్ణుతేజ స్స్వరూపిణీ! నీయంశమువలన(పూవులేక యేఫలించు) బిల్వః=పాపములను, మమావ్యాధులను బోఁగొట్టు, మారేడు చెట్టు అధిజాతః = పుట్టినది. ''కాత్యాయన్యాః శమీ జాతా బిల్వో లక్ష్మాః కరోభవత్‌'' వా|| పురాణము. కరమునఁగా అంశము ''బలిహస్తాంశవఃకరాః'' కోశము. తస్యళలాని = దాని పండ్లు, మా = నన్ను గూర్చి, అంతరాః = అంతరింద్రియములకుఁ జెందని, అజ్ఞాన పాపాదిసంబంధములైనవియు, బాహ్యాః = వెలివైన (బహిరింద్రియములకుఁజెందిన;) యా అలక్ష్మీః = ఏదౌర్గత్యములు గలవో వానిని; తపసా = నీశక్తిచేత (మేము నిన్నుఁ గూర్చి చేయు మంత్రావృత్తిచేత) నుదంతు = పోఁగొట్టును గాక. ఇచట మాయాంతరాః = అ విద్యాసంబంధముచే అంత రింద్రియమలుకుఁ జెందినట్టియు, అనియును జెప్పవచ్చును.

భావము:- విష్ణుతేజోరూపిణీ! శ్రీదేవీ! నీ యిచ్ఛా వక్తిచేతనే నీయంశముతోఁబుట్టినదియు. పూలు లేకయే ఫలించునట్టియు, ఎల్లప్పుడును నీ సాన్నిధ్యము గల్గి, నీపేరనే శ్రీవృక్షమని వెలయునట్టిదియు, మా పాపములను సర్వవ్యాధులను దొలఁగించునదియు నైన మారేడుచెట్టు మొదలఁగూర్చుండి, దానిపండ్లనే యాహారముగా గొనుచు నిన్ను పాసించుచున్నాను. దాని దళములతో నిను బూజించుచున్నాను. జ్ఞానప్రదశక్తి నీకే గాక శ్రీవృక్షమునకును గలదు. అవిద్యా జన్యములై సర్వేంద్రియములకు సంబంధించిన, పాపఫలములు గానైన దారిద్ర్యాదిరూపదుర్గతులను బోఁగొట్టుఁగాక.

ఈ మంత్రమందు శ్రీకాముఁడు మహాత్రిపురసుందరిని మారేడుతోఁటయందో మారేడుచెట్టుమొదలనో కూర్చిండి యుపాసించుటయు, దీక్షాకాలమందు మారేడుపండు నిత్యముఁ దినుటయు విధి యనియు, అది జ్ఞానప్రదమై పాపవ్యాధిహర మైనదనియు సూచింపఁబడినది. మఱియు మారేడు దళములతో శ్రీచక్రమును బూజించుటయు, పండ్లను దళములను ఆజ్యయుక్తముగా హోమము చేయుటయు జ్ఞానప్రాపకమును అలక్ష్మీ నిర్హరణము నని యింకెంతయో స్కాందపురాణమందును. వామనపురాణమందును విపులముగాఁ గాన నగును.

బిల్వనాథప్రియాయాస్తు నారాయణ్యా స్తపోబలాత్‌ |

బిల్వారణ్యం ఫలత్యద్య లోకాలక్ష్మీవివృత్తయే ||

తత్రత్యబిల్వపత్రాంభః స్నానం తత్ఫలసేవనం |

జ్ఞానదం ముక్తిదం లక్ష్మీభోగ భాగ్యవివర్థన్నం ||

బ్రహ్మాండపురాణము.

మఱియు:- తనుమధ్యా మహాలక్ష్మీం బాలాం త్రిపురసుందరీం |

త్రిబిల్వపత్రైః సంపూజ్య సహస్రం ప్రజ పేదృచమ్‌ ||

బిల్వస్య హవిషా హోమ ఆజ్య హోమశ్చ శస్యతే |

ఐశ్వర్యేణార్చయే ద్దేవీం బిల్వపత్రైర్హరిద్రయా ||

రుద్రలక్షప్రదీపైశ్చ నీరాజనవిధిం చరేత్‌ |

ఏకబిల్వఫలాహారః సతతం నియతవ్రతః ||

శాంతిం కృత్యా విధానేన జగదంబాప్రసాదతః |

అలక్ష్మీం పరిభూయాథ మహాలక్ష్మీం స్థిరాం లభేత్‌ ||

అని సౌభాగ్యసంజీవనము.

ఐశ్వర్యము = ఉమ్మెత్తపూవు, పరాశక్తివిభూతి విస్తరించియున్నయోషధుల ననేకములను మన మహర్షులు తపోబలమునఁ గనిపెట్టి, వాని సాన్నిధ్యసంస్పర్శాదుల వలని ఫలములిట్టివనుభవింపుఁడని శాసించిరి. గుణహమత్త్వమును బట్టి వేమును పరాశక్తియే యనిరి. రావిచెట్టు త్రిమూర్తిస్వరూపమనిరి. గుల్మజాతులందరుఁ దులసి లక్ష్మీనారాయణ స్వరూపమనిరి. వ్యాధి హరణగుణములతోఁబాటు జ్ఞానప్రదగుణమును వాని సాన్నిధ్య, సంప్పర్శ, ఫలమూలాది భక్షణాదులవలన ననుభవించి వ్రాసిరి, బుద్ధుఁడు రావిచెట్టు మొదలును, నరనారాయణులు బదరీవనమునను, జయదేవాదులు బృందావనమునను దపమాచరించుటకు హుతువిదియే. అటులనే శ్రీమాతృశక్తి శ్రీవృక్ష (మారేడు) సాన్నిధ్యమాత్రమునను, తత్పత్రసంస్పర్శ మాత్రమునను తత్ఫలభక్షణమాత్రమునను తపస్సాధకునకు సంక్రమించి ఫలప్రదమనుటను వింతయేమి? ఇంక నిట్టివెన్నియె కలవు. ఏయే వృక్షముల సమిధలు హోమము చేసినపుడు తద్ధూమసంపర్కా ఘ్రాణములవలన నెట్టి గుణములో వానిని వ్రాయఁబూనినను, ఆయుర్వేదము నైపయి వాని వాని వ్యాధిహరణశక్తులను సమన్వయించి వ్రాయఁబూనినను బెద్ద గ్రంథమే యగును గాన భగవంతుని ప్రత్యక్షవిభూతియోషధులం దద్భుతావహమను మాటతో విడిచెదను.

శ్రీవిద్యయందు, బిల్వ మూలాసన, బిల్వపూజా, బిల్వహోమ, బిల్వాహారములు సాధకునకు బహూపకారకము లని మనవి చేయుచున్నాను. మహాకవి కాళిదాసుఁడు బిల్వ పత్రార్చన ఫలమును దన 'దేవీపంచస్తవి' యందుగ్గడించిన శ్లోకమునకు నా యనువాద పద్యము:-

''జనని! భవత్పదార్చనకుఁజాలిన బిల్వదళాలు కోయుటన్‌

దునిఁగిన ముండ్లతోఁబరిచితు ల్గన వేరికరాలు, వారలే

యనువునఁబద్మకాంతిధనురంకుశ చక్రఝషాదులైన, ల

క్కనముల నొప్పు హస్తముల క్ష్మాపతులైజనియింత్రు. చండికా?''

_______________________________

(చూ. దేవీ పంచస్తవి)

ఇందలి 'యాదిత్యవర్ణే' యను సంబుద్ధిచే అరుణాభయగు శ్రీబాలా త్రిరపుసుందరీరూపము సూచితము.

7. ఓమ్‌ ఉపైతు మా దేవసఖః

కీర్తిశ్చ మణినా సహ |

ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేస్మిన్‌

కీర్తిమృద్ధిం దదాతు మే ||

ప్రకటార్థము

J $®µ…[„s! ª«sV¥¦¦¦®µ…[ª«so¬s ¿ÁÖÁ„sVNS†²R…V NRPVÛËÁ[LRiV†²R…Vƒ«sV NUPLRiòQùÕ³Áª«sW¬s ®µ…[ª«s»R½¸R…VV†ÑÁLi»yª«sVßÓá»][†gRiW²T… ƒ«sƒ«sVõ† ÛÇÁ[LRiVµR…VLRiVgSNRP, C ª«sVLRiòQùÍÜ[NRPª«sVVƒ«s†‡ÁVÉíÓÁ ¬sƒ«sVõFyzqsLi¿RÁV¿RÁVƒ«sõªy†²R…ƒ«sV. ANRPVÛËÁ[LRiV†²R…V NUPLjiò¬s, xqsNRP\ÛÍÁaRP*LRiù xqsª«sVXµôðj…¬s ¬ds ¸R…Wƒ«s¿Á[ ƒyNTP¿RÁV胫sV gSNRP.

రహస్యార్థము

హే శ్రీః = ఓసౌభాగ్యలక్ష్మీ! దేవసఖః = వాయు మిత్రుఁడైన స్వాధిస్ఠానగతాగ్నియు; 2. నిన్నుఁబంచదశాక్షరీ విద్యతో నుపాసించి సిద్ధుండయిన కుబేరుఁడును; మామ్‌ + ఉపైతు = నన్నుఁజేరి యనుగ్రహించుఁగాక, కీర్తిశ్చ = కీర్త్యభిమానదేవత (నీవును).

''రాజరాజేశ్వరీం లక్ష్మీం వరదాం మణిమాలినీం |

దేవీం దేవప్రియాం కీర్తిం వందే కామ్యార్ధసిద్ధయే |''

ధ్యానశ్లోకము.

మణినా సహ = జ్ఞానముతోఁగూడ (మణిశబ్దోపలక్షణముచే సువర్ణధనధాన్యాదులు గ్రాహ్యములు) అనుగ్రహించుఁగాక.

అస్మిన్‌ + రాష్ట్రే * ప్రాదుర్భూతః + అస్మి = ఈ మనుజలోకమున నీ శరీరమునఁ బుట్టినవాఁడనైతిని; దేవసఖః = 1. ఆ అగ్నిదేవుఁడు 2. దేవతల కెల్లరకును మిత్రుఁడైన రుద్రుఁడు; మే = నా కొఱకు; కీర్తిం కీర్తినామక వైన నిన్నును; 2. ననుఁజేరు; బ్రహ్మవిద్యార్థులకు జ్ఞానదానముచేయుటవలన యశస్సును; బుద్ధిం = 1. జ్ఞానసమృద్ధిని 2. అప్రా కృతశక్తిని, ధనాదులను; ద దాతు = ఇచ్చునుగాక. ఇచట, మణినా = పంచదశాక్షరీ విద్యారత్నముతో అని చెప్పవచ్చును. ''స తం మఱిమవిందత్‌'' అరుణోపనిషత్తు.

భావము: ఓ రాజరాజేశ్వరీ! నాప్రాణాయామ క్రియయందు సాయపడఁదొల్తనాచేఁబిల్వఁబడిన యజ్ఞపురుషస్వరూపుఁడైన పరమేశ్వరుఁడును, తచ్ఛక్తివైకీర్త్యభిమాని దేవత నైన నీవును, నిన్నుపాసించి సిద్ధుఁడై నవనిధుల కధిపతియైన శివసఖుఁడు కుబేరుఁడును, యీ యుపాధితోఁ బుట్టిన నాకు జ్ఞానమును, శ్రీవిద్యార్థులకు విద్యాదానము చేయుటచే నగు యశస్సను దనధాన్యసమృద్ధిని, అప్రాకృతశక్తులను నిచ్చి యనుగ్రహింతురు గాక'' యని సకామభక్తితో సాదకుఁడు ప్రార్థించుచున్నాఁడు.

''కీర్తిర్మతిర్ధృతిః పుష్టి స్సమృద్ధిస్తుష్టి రేవ చ,

శ్రుతిఃస్మృతిర్బలం మేధా శ్రద్ధారోగ్యజయాదికాః ||

దేవతాశక్తయః సర్వాస్తత్తద్దేవాంశగా నృప,

మహాలక్ష్మీముపాసంతే తస్యాః కింకర్య ఏవ తాః''

అనియు భార్గవసంహిత. అప్రాకృతశక్తులగూర్చి 8 వ ఋక్కు క్రిందఁ జూచునది.

8. ఓమ్‌క్షుత్పిపాసామలా జ్యేష్ఠా

మలక్ష్మీం నాశయామ్యహమ్‌ |

అభూతిమసమృద్ధిం చ సర్వా

న్నిర్ణుద మే గృహాత్‌ ||

ప్రకటార్థము

ఓ శ్రీదేవీ! అఁకలిదప్పులచే మలిన యైనదియు, నీకంటె ముందున్నదియునై యలక్ష్మీరూపమైన జ్యేష్ఠాదేవిని (పెద్ద మ్మను) నేను నశింపఁజేయుదును. నాయింటినుండి యనైశ్వర్యమును అసమృద్ధిని నీవు తొలఁగింపుము.

రహస్యార్థము

మే శ్రీః = ఓ సౌభాగ్యలక్ష్మీ! క్షుత్పిపాసామలాం = ఆకలిదప్పులచే మలిన యైనదియు; జ్యేష్ఠాం = (ఇదివఱకే నన్నుబట్టియున్నది నిరంతరము నాచే నారాధింపబడినది గాన) నీకంటె ముందున్నది (పెద్దమ్మ) యైన; అలక్ష్మీం = దౌర్భాగ్యమనెడి దానిని; అహం నాశయామి = నేను రూపు మాపెదను. అందులకై, మేగృహాత్‌ = నాశరీరమునుండి (నాలోనుండి) అభూతిం = అనైశ్వర్యమును (ఈశ్వరభావము లేమిని,) అనంగా అనాత్మనే ఆత్మగా నెంచిన యవివేకమున ''శివోహ'' మనెడి భావము లేమిని; అసమృద్ధిం = అప్రాకృత శక్తిలోపమును; నిర్ణుద = తొలగింపుము.

తల్లీ! శ్రీమహాత్రిపురసుందరీ! విద్యాపరమాత్మస్వరూపిణవై యుపాసాశీలురను లక్షించుదానవు గాన నీవు లక్ష్మివి. అట్టి నీ సేవవైపు నేఁగాకున్నంత కాలమును, మున్ను నన్నుఁ బట్టి విడువనిదై యాఁకలిదప్పులకై యెన్నో కూర్చుకొనుట యనెడి తృష్ణయే సేవింపఁబడెను. ఆ దౌర్భాగ్యతృష్ణ యనెడి యలక్ష్మియే ముందుండినది. దానినే తల్లిగా సేవించితిని గాన, అది జ్యేష్ఠ. పెద్దమ్మ, తరువాత నీ కరుణచేఁ గల్గిన జ్ఞానసౌభాగ్య తృష్ణయే నీవు గానఁ బిన్నమ్మవు. ఆ క్షుత్సిపాసాతృష్ణయనెడి దౌర్భాగ్యము నేనిపుడు రూపడఁగింతును. అనఁగా నీ యుపాస్తిచేనైన జ్ఞానానందామృతపానముచే నే నాఁకలిదప్పులు లెక్క సేయను. నాయందీశ్వరభావమును బెంపొందింపుము. అప్రాకృతశక్తులను నాకుఁ బెట్టుము. (అప్రాకృతశక్తులు 1, అణిమ 2. మహిమ 3. గరిమ 4. లఘిమ 5. ప్రాప్తి 6. ప్రాకామ్యము 7. ఈశత్వము 8. వశిత్వము ఇవెల్లరెఱింగినవే.ఇవే యష్టసిద్ధులు.)

నిజముగా బ్రహ్మజ్ఞానియందుదయించు సిద్దుల స్కాందమునఁ దెలుపఁబడినవి. 1. ఆనందము తనంతనే యుప్పతిల్లుట, 2. సుఖదుఃఖాది ద్వంద్వములకు లోఁగకుండుట, 3. ఇది గొప్ప ఇది కొలది యను భావము తొలఁగుట, 4. అస్వస్థతాస్వస్థతల యందు సమత్వము, 5. బలకాంతులధికమగుట, 6, పరమాత్మ పరత్యముచే ధ్యానయోగభంగము లేకుండుట, 7. స్వేచ్ఛా వృత్తి (పరతంత్రుఁడు కాకుండుట) 8. సుఖశయనాదికాపేక్ష లేక యెక్కడ వీలయిన నక్కడనే నిదురించుట,

అనఁగా శ్రీవిద్యోపాసనసిద్దులైన సాధకులు, జ్ఞానానందానుభూతియు, శివోహం భావసిద్ధియు, అప్రాకృత దివ్యశక్తి లాభము నొంది, నిత్యానందామృతపాయులై, ప్రాకృతవస్తుసేవచేఁ దాత్కాలికముగా మాత్రమే యడఁగు నాఁకలిదప్పులకును లోఁగక ధీరులై మందురని భావము.

త్రికాలజ్ఞానము, దూరదృష్టి దూరశ్రవణములు, పరలోక వార్తాజ్ఞానము, అనధీతశాస్త్రజ్ఞానము, జరావిజయము, తుదకు స్వేచ్ఛామరణము. ఇట్టివన్నియు నప్రాకృతశక్తులు. శ్రీవిద్యోపాసనమున సిద్ధించును, (త్రిపురాసార సముచ్చయము).

8. ఓమ్‌ గంధద్వారాం దురాధర్షా నిత్యపుష్టాం కీరషిణీమ్‌

ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్‌

ప్రకటార్థము

గంధగుణము లక్షణముగా గలదియు, అతికష్టముచేనారధింపఁబడునదియు, నిత్యము సస్యాదిసంపదల నిండు గలదియు. గవాశ్వాదిబహుపశు సంపద గలదియు, భూతపంచక మునందుఁగడు గొప్పదియు, నగు బూరూపలక్ష్మిని నేను బిలచుచున్నాను. ''విష్ణుపత్నీం మహీం దేవీం'' భూసూక్తము. ఇచట సాధకుఁడు భూరూపశ్రీ తన్నుఁజేరుఁగాక యని కోరుచున్నాఁడు.

రమస్యార్థము

గంధద్వారాం = పూర్వపుణ్యవాసనయే తన్నుఁజేరుదారిగాఁగలదియు; దురాధర్షాం = అట్టి పుణ్యగంధము లేని చపలేంద్రియులకు సులభ కానిదియు; (శ్రీశంకర భగవత్పాదుల సౌందర్య లహరి మొదటి శ్లోకము. ''అతస్త్యామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి'' = అమ్మా! హరిహరబ్రహ్మాదులకును నారాధ్యనగు నిన్ను, నుతించుటకైన మ్రొక్కుటకైనఁబూర్వపుణ్య గంధము లేని వారలెట్లు సమర్థులగుదురు?) ''దురాధర్షా, దురారాధ్యా'' అను నామభాష్యమందును నిదియే యర్ధము.

నిత్యపుష్టాం = 1. ఎల్లప్పుడును షట్త్రింశత్తత్త్వవిగ్రహయై యుండునదియు, 2. సర్వభూతములందును బుష్టిరూపగా నుండునదియు ''యా దేవీ సర్వబూతేషు పుష్టిరూపేణ సంస్థితా'' మార్కండేయ వచనము, కరీషిణీమ్‌ = మాయను (అవిద్యను) నశింపఁజేయునదియును; (వర్గాదిర్మాయా దేవేశః కకారః కామాగః స్వరః'' మాతృకాకోశము, సర్వభూతానాం + ఈశ్వరీం సర్వప్రాణిజాతమునకును (చరాచర సృష్టికంతకు) నియామిక (ప్రభ్వి) యైనదియు; తాం బ్రహ్మస్వరూపిణియైన (సుప్రసిద్ధయైన) : శ్రియం = 1. భక్తులాశ్రయింపఁ దగిన) జ్ఞానానందరూపిణియైన మహాత్రిపురసుందరిని ఉపహ్వయే = ఆశ్రయించుచున్నాను. (బిలుచుచున్నాను.)

భావము:- సౌభాగ్యవిద్యానామక శ్రీమహాత్రిపురసుందరి, పూర్వపుణ్యవాసన గల విజితేంద్రియులకే గాని తదితరులకుఁదేఱిచూడ నలవి కానిదనియు, సర్వమును బోషించు నది యనియు, కాలదిరుద్రాంతమగు 36 తత్త్వములు విగ్రహముఁగాగలదియనియు,అజ్ఞానము నడంచునది యనియు, చరాచరసృష్టికంతకు నియంత్రి యనియు, నిగ్రహానుగ్రహసమర్థ యనియు నుతింపఁబడెను.

10. ఓమ్‌ మనసః కామమాకూతిం వాదః సత్యమశీమహి |

పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ||

ప్రకటార్థము

ఓ శ్రీదేవీ! మనోరథసిద్ధిని, సంతోషమును, సత్యవాక్కును, గోమహిష్యాదిపశువులను, భక్ష్యభోజ్యాదికమును, సంపదను, కీర్తిని నాకొసంగుము.

రహస్యార్థము

హే శ్రీః = అక్ష్మీ దేవీ! మనసః = నీయుపాసనముచేగల్గు జ్ఞానమువలన; కామం = కోరికను; ఆకూతిం = ఇంద్రియార్థము లను; (కామాకూతిపదములు ధర్మార్థకామముల కుపలక్షణములు). ''త్రివర్గదాత్రీ సుభగా'' నామస్మరణము. వాచః = వాగ్వికాసమును; సత్యం = 1. బ్రహ్మలోకమును, 2. ''సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'' యను శ్రుతిచే, బ్రహ్మమును; 3. పవిత్రతను; పశూనాం రూపం = జీవాత్మస్వరూప జ్ఞానమును, అన్నస్య రూపం = పరమాత్మ స్వరూపజ్ఞానమును; ''(అహమన్న మహమన్న మహమన్నం'' ''అన్నం పరబ్రహ్మ'' అని శ్రుతి.) అశీమహి మేము పొందెదము. మయి = నీయుపాసకుడనైన నాయందు; యశః = కీర్తి; శ్రయతాం = చేరునుగాక.

తైత్తిరీయశ్రుతియందు శ్రీకాముడు అగ్నిని బ్రార్థించు నప్పటి హోమమంత్రములు చూడుడు.

''ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహా| విమాయంతు బ్రహ్మచారిణః స్వాహా| ప్రమాయంతు బ్రహ్మచారిణః స్వాహా దమాయంతు బ్రహ్మచారిణః స్వాహా| శమాయంతు బ్రహ్మచారిణః స్వాహా| యశోజనేస్సా స్వాహా||'' అనఁగా విద్యార్థులగు బ్రహ్మచారులును, స్వర్గాదిలోకప్రాపకములగు లౌకిక విద్యలను గోరు బ్రహ్మచారులును, మోక్షవిద్యను గోరు బ్రహ్మ చారులును, శేష్ఠబుద్ధి గలట్టియు, కామక్రోధాదిదోషములు లేని బ్రహ్మచారులును నన్ను గూర్చి వచ్చెదరు గాక. ఈ యాచార్యుఁడెందఱికో జ్ఞానదానము చేసెనన్న కీర్తి నన్నుఁ జేరుఁగాక. యని యుండుటచేఁగీర్తి యనునపుడిదియే యపేక్షణియము, ఇంతే గాక, శీక్షావల్లియందు, -''ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః'' ప్రజాతంతువు తెగకుండఁజూడుమా, యనఁగా నీవు నావలన సంగ్రహించిన జ్ఞానమును శిష్యపరంపర కవిచ్ఛిన్నముగా నిచ్చి విద్యా సంతానముకొనసాగునట్లు చూడుమా'' యని శిష్యు నాచార్యుఁడు శాసించుచున్నాఁడు, గాన నిట్టి కీర్తియే యపేక్ష ణీయము.

భావము: శ్రీదేవినుపాసించు వారలకుఁ ద్రివర్గమును స్వర్గలోక బ్రహ్మలోకములును, ఆత్మానాత్మ వివేకమును, వాగ్వికాసమును, అనేకులకు బ్రహ్మవిద్యాదానము చేసిన కీర్తియు, పరబ్రహ్మవ్యాప్తియుఁగలుగునని యీస్తుతి తెలుపుచున్నది.

11. ఓమ్‌ కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |

శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్‌ ||

ప్రకటార్థము

ఓయి! కర్దముఁడా! నీవు నాయెడఁ బ్రసన్నుఁడవగుము. నీచేతనే (నిన్నుఁగని) లక్ష్మీదేవి సుపుత్త్రవతి యైనది. తామర పూదండలు దాల్చిన నీ తల్లిని శ్రీదేవిని నాయింటను (వంశమందు) నివసింపఁజేయుము.

రహస్యార్థము

కర్తమేన = బ్రహ్మలలో నొకఁడనైన నీచేత; శ్రీః = లక్ష్మీదేవి; ప్రజాభూతా = సుపుత్రవతి యైనది; ''కరోతీతి కర్దమః'' (సృష్టి) చేయువాఁడు కర్దముఁడు. ప్రజాపతులలో నొకఁడు. ఇతఁడు శ్రీమాత నర్చించి సిద్ధినొంది, సృష్టికార్యమందును సిద్ధుఁడైనాఁడు.* మంత్రద్రష్టయు సిద్ధుఁడును గావుననే

_____________________________

* శ్రీశంకరుల సౌందర్యలహరి రెండవ పద్యము నాయనువాదము జూచునది.

యనేక మంత్రములకు ఇతఁడు ఋషిఁఁగా జెప్పఁబడుచున్నాఁడు. విద్యాసంతతియందితఁడు మొదటివాఁడు, కావుననే పుత్త్రుఁడుగా భావింపఁబడినాఁడు. ''ఆనందః కర్తమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః | ఋషయస్తే త్రయః పుత్రాః స్వయం శ్రీరేవ దేవతా'' అని స్మరణము.

శ్రీపుత్త్రుఁడవైన కర్దముఁడా! మయి = నాయందు; సంభవ = ప్రసన్నుఁడవగుము; మాతరం = నీతల్లియు; జగజ్జననియునైనట్టియు; పద్మమాలినీం = (షట్పద్మములందు సంచరించుటచే) పద్మమాల గలట్టియు; శ్రియం జ్ఞానానందస్వరూపిణి యైన శ్రీమహాత్రిపురసుందరిని; మే + కులే = నాసుషుమ్నయందు; వాసయ = నిలువఁజేయుము. (లేదా, నావంశమందు స్థిరముగా శ్రీమహాత్రిపురసుందరి యర్చింపఁబడు చుండునుగాక)

శ్రీవిద్యోపాసనసిద్ధులై శ్రీ దేవీపుత్త్రులుగా నెన్నఁబడుచుఁ బరదేవతాభిన్నులై శాశ్వతులైన వారి ప్రసాదమును గోరుట ధర్మమే కావున నిట సాధకుఁడు తనయాంతరోపాసాసిద్ధికై మున్నగాఁగర్దమప్రజాపతివిబ్రార్థించుచున్నాఁడు.

ఇటులే శ్రీవిద్యావరివస్యాసిద్ధుఁడయి చీక్లితుఁడను నామాంతరముగల మన్మథుని ముందు ఋక్కునందుఁ బ్రార్థించును.

12. ఓం ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమేగృహే |

ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే ||

ప్రకటార్థము

చిక్లీతుఁడను పేరు గల మన్మథుఁడా? స్నేహగుణయుక్త యైన శ్రీదేవియందుఁనీవుపుట్టితివి. నీవు నాయింట నుండుము. నీ జననియైన (జగజ్జననియైన) శ్రీదేవిని నాయింట సుస్థిరగా నుండఁజేయుము.

రహస్యార్థము

స్నిగ్థా = ప్రేమగల (మమకారముగల) లక్ష్మీ దేవివలన; (స్నిగ్ధాయాః లక్ష్మ్యాః (సుపాం సులుగితి పంచమ్యాలుక్‌); సృజం = జననమును, ఆపః = పొందితిని; హే చిక్లీత = మన్మథుఁడా?

శ్రీదేవ్యాస్తనయో జజ్ఞే చిక్లీతో నామ మన్మథః |

అబన్నవికృతౌ చిత్తే జాతః కామో హి చిత్తజః ||

అని స్మరణము గావునఁ జిక్లీతుఁడే మన్మథుఁడు. ఈతఁడు శ్రీదేవిని ''కాదివిద్య''చే నుపాసించిన సిద్ధుఁడు (శ్రీశకంరుల సౌందర్యలహరి ఆఱవ పద్యము జూడుఁడు.) మంత్రద్రష్టయై ఋషిగా నెన్నఁబడుచున్నాఁడు. కావుననే కొందఱు సౌభాగ్య విద్యాజపమందు ''కామో ఋషిః'' యని చెప్పి గౌరవింతురు. కొందఱు ''ఆనందభైరవ ఋషిః'' యని చెప్పి కొదరు. ఇందు మొదటి పక్షము వారికే ''కామఋషి వారు'' అను నింటి పేరయ్యెనందురు. కాని ''కామశబ్దః శివపరత్వాత్‌ కాదివిద్యాయాః శివరూపదక్షిణామూర్తి ఋషిత్వంలో కేప్రసిద్ధం | వైదేహీజనయామాసేతి శ్రుతౌస్పష్టం''

''లక్ష్మ్యాస్త్రివర్గరూపాయాః ప్రాప్తిః కామనిబంధనా |

తస్మాచ్చిక్లీతనామానాం లక్ష్మీపుత్రం సుదుర్జయం |

కామదేవం సమారాధ్య యత్నతః ప్రాప్ను యాచ్ఛ్రియం''

అనుసూక్తార్థసంగ్రహవాక్యమును బట్టి ధర్మార్థకామములనెడి త్రివర్గమును బడయఁగోరు వారు మన్మథునే ఋషిగా గ్రహించిరి. తురీయపురుషార్థ (మోక్ష) మును గోరువారు మంత్ర స్రష్టయైన ఆనందభైరవుని ఋషిగా నారాధించిరి. ఇది సంప్రదాయ రహస్యము. అని యందురుగాని కామానంగమన్మథపదములు శివపరములే. అదియుండనిండు.

లక్ష్మీః ప్రయత్న సాధ్యాహి యత్నః కామసముద్భవః ||

చిక్లీత శ్రీసుత స్వామింశ్చిరం నివస మద్గృమే ||

త్వదాగమనమాత్రేణ త్వన్మాతా త్వామనువ్రజేత్‌ |

త్వయి ప్రీతిపరా సా హి తవ ఛందోనువర్తినీ ||

శ్రీదేవి యుపాసనప్రయత్నలభ్య. యత్నము నీచేతిది, గాన శ్రీపుత్త్రుఁడవైన చిక్లీతుఁడా! నీవు చిరము నాలో నుండుము. నిన్నే నీతల్లి వెంబడించును; నీయందపారప్రేమ గలది గాన నీ యిష్టమునే యనుసరించును. ఆ జగన్మాత నా సుషుమ్న యందుఁజక్క నిల్చునట్లు చేయుము.''

ఇచట సాధకుఁడు స్వభావముచేఁజంచలయు, ''దుర్గమాదుర్లభా దుర్గా'' యను నామస్మరణమునుబట్టి యతికష్టముచేఁ గాని పొందరానిదియుఁ గానఁ, దన యుపాసనసిద్ధికై చేయు ముఖ్యప్రయత్నములం దొకటిగా నెంచి, ''భక్తప్రియా, భక్తి గమ్యా, భక్తి వశ్యా, భయావహా'' అను సార్థకనామయైన శ్రీదేవీ, భక్తశ్రేష్ఠుఁడై యుపాసనాసిద్ధుఁడై లక్ష్మీపుత్రుఁడుగా నెన్నఁబడునట్టియు, సౌభాగ్యవిద్యాజపమందు ఋషిగా నారాధింపబడునట్టియు, మన్మథుని ప్రసాదమునఁ దన యుపాసన వ్యవసాయము సమత్రసిద్ధి నొందఁగలదని యీమంత్రమందు మన్మథు నర్థించినాఁడు.

మఱియు, ''మాతరం, శ్రియం'' అనుటయందును విశేషము గలదు. లక్ష్మీ బీజమునకును ''మాతా'' యను సంజ్ఞ గలదు. ''శ్రీర్మా రమా చ కమలా మాతా లక్ష్మీశ్చ మంగళా'' విశ్వకోశము. సాధకుఁడు చిక్లీతుఁడా! జగజ్జనని కంటెను వేఱు కాని శ్రీబీజ ఉ సర్వకాలము నాచే జపింపఁబడునట్లు చేయుము| జ్ఞానానందస్వరూపిణి యను నర్థమిచ్చు శ్రీబీజముచేఁ దెలియఁబడు (మంత్రసారా-మత్రరూపిణీ నామాధ్యాయము) సౌభాగ్యలక్ష్మి నన్నుగ్రహింపఁజేయు మనియు వేడుచున్నాఁడు.

13. ఓం ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పిఙ్గలాం పద్మమాలినీం |

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

ప్రకటార్థము

ఓ యజ్ఞపురుషుడా! దిగ్గజములు తొండములతోఁ బట్టిన కుంభముల వయస్సులచేఁ దడిసినట్టియు, (తామరలతను బోలినట్టియు) తామరదండలను దాల్చినట్టియు, వెన్నెలవలె శోభిల్లునట్టియు, (తామరలతను బోలినట్టియు) తామరదండలను దాల్చినట్టియు, వెన్నెలవలె శోభిల్లునట్టియు, (చంద్రునం దారాధింపఁ బడునట్టియు,) గోరోచనపువన్నె గలట్టియు, బంగారు తనరూపమైనట్టియు, లక్ష్మీ దేవిని నాప్రయోజనమునకై పిలువుము.

రహస్యార్థము

హే జాతవేదః ఓరుత్రరూపయజ్ఞ పురుషుఁడి! ఆర్ద్రాం = శీతలగుణము గలట్టియు, పుష్కరిణీం = 1. (పుష్కరః = శివః) నీశక్తియైనట్టియు; 2. (పుష్కరములు = పద్మములు) మూలాధారాదిషట్పద్మముల సంపర్కము గలట్టియు; 3. (పుష్కరం = ఆకాశము) చిత్తాకాశ చిదాకాశ భూతాకాశము లనెడి త్రిపుష్కరములందు వ్యాపించు నట్టియు, లేదా తత్స్వరూపయై నట్టియు, 4. పుష్కరః = ఒక యోగము. ''విశాకస్థో యదా భానుః కృత్తికాసు చ చంద్రమాః | స యోగః పుష్కరో నామపుష్కరేష్వతిదుర్లభః'' పాద్మము. అట్టిసుయోగమునందారాధింపఁబడునట్టియు; లేదా, తత్స్వరూప యైనట్టియు; 5. పుష్కరతీర్థరూప యైనట్టియు; 6. భూస్వరూపయైనట్టియు; అను నర్థములు చెప్పికొనవచ్చును.

''ఓషద్వీపవిహగ తీర్థరాగోరగాన్తరే |

పుష్కరం తూర్యవక్త్రే చ ఖణ్డ ఖడ్గ ఫలేపి చ ||

పుష్కరం పంకజేన్యోమ్ని పయః కరికరాగ్రయోః''

విశ్వకోశము.

పద్మమాలినీం = పద్మమాలీ = సూర్యుడు, తత్తేజఃస్వరూపిణి పద్మమాలిని; చంద్రాం = జ్ఞానానందస్వరూపిణిని 2. అజ్ఞాదిసహస్రారాంతముగాఁ జంద్రునివలేఁ బ్రకాశించి యానందపెట్టుదానిని, హిరణ్మయీం = శివశక్తిని (''హిరణ్య రేతసః శంభోః శక్తిః ప్రోక్తా హిరణ్మయీ'') మ + అవహ = నా కొఱకాకర్షింపుము.

పరాశక్తియొక్క వివిధశోభలు వెనుకటి ఋక్కులందుఁజెప్పబడినవే మఱల మఱలఁ జెప్పుట ఆదరార్థము, సాధకబోధ నార్థముఁచేయఁబడిన స్తుతి. ''వ్యాపినీ వివిధాకారా'' మనెడి దేవీనామములు సార్థములు. అంతరోపాసనముననే గాక బాహ్యోపాసనమునను భగవన్నమహిమము పౌనఃపున్యముగా నుతించుట శ్రుతిలక్షణము. జగతనుగ్రహరూపము.

14. ఓం ఆర్ద్రాం యఃకిరిణీం యష్టిం

సువర్ణాం హేమమాలినీం |

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం

జాతవేదో మ అవహ ||

ప్రకటార్థము

పాఠకులారా!

ఇందను ''యఃకరిణీం యష్టిం'' అను మాటలు తక్క నితరముల ప్రకటనగుప్తార్థములు వెనుకటి ఋక్కులక్రింద సిద్ధములే. యఃకరిణీం = బెత్తమును జేతఁదాల్చినట్టియు; దండ నాథాస్వరూపిణి యైనట్టియు; యష్టిం = ధర్మదండస్వరూపిణియై నట్టియు శ్రీదేవిని నాకొఱకుఁ బిలువుమని జాతవేదుని సాధకుఁడు వేఁడు చున్నాఁడు.

రహస్యార్థము

యఃకరిణీం = యశస్సును కలిగించునట్టియు; ''యశోయః కథితః శిష్టైర్యోవాయురితి కీర్తితః'' మాతృకాకోశము.

యష్టిం = దారమువలె సన్ననైనదియు; సుషుమ్నామార్గసంచారమునఁదామరతూఁటి దారమువలె సన్న గానుండునదియు; ''బిసతంతుతనీయసీ'' యని నామాధ్యాయము. త్రిపురాసారగ్రంథమున శ్రీనాగభట్టు, ''తదంతర్గతం బ్రహ్మరంధ్రం సుసూక్ష్మం మృణాలాంతరాలోల్లసద్యష్టితుల్యమ్‌'' యష్టిశబ్దము దారము (తంతు) అనునర్థమందే చెప్పఁబడినది. అట్టి శ్రీదేవిని నాకొఱకుఁ బిలువు మని వేఁడుచున్నాఁడు.

ఇందును దక్కిన పదముల రహస్యార్థము వెనుకటి ఋక్కులందుసుసిద్ధము.

15. ఓం తాం మ ఆవహ జాతవేదో

లక్ష్మీ మనపగామినీం |

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో

దాస్యోశ్వాన్‌ విందేయం పురుషానహం ||

ప్రకటార్థము

ఈ మంత్రమందును ''ప్రభూతం, దాస్యః'' అనునవి తక్క నితరములు వెనుకటి మంత్రములందు వ్యాఖ్యాతములే. ప్రభూతం = అధికముగా; దాస్యః = పరిచారికలు.

రహస్యార్థము

దాసః = పరిచారికులు; అనఁగా శ్రీమహాత్రిపురసుందరీ వివిధశక్తులు ఆమె పరిచారికులుగా నెన్నఁబడుటచే, అణిమాది సిద్ధులును, రసోల్లాసాది సిద్ధులును (8వ ఋక్కు క్రిందఁ జూచు నది) కీర్తి, మతి, బల, ఆరోగ్య, విజయ, స్మృతి, తుష్టి,పుష్టి, మేధాదులు శ్రీదేవి పరిచారికులు. ''దాసీభూత సమస్త దేవవనితాం'' అను ధ్యానస్మరణముచే దేవతల భార్యలుగా నెన్నఁబడి పరాశక్తికి ఁబనికత్తెలుగా నుండు దివ్యశక్తులన్నియు నని యర్థము. తక్కిన వన్నియు రెండవ ఋక్కు దిగువను వ్యాఖ్యాతములే.

ఫలస్తుతిరూప విశేషజ్ఞాపనము

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం |

శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్‌ ||

ప్రకటార్థము

శ్రీకాముఁడైన సాధకుఁడు బాహ్యాభ్యంతరములందుఁ బరిశుద్ధుఁడై ప్రతిదినమును స్వశాభోక్తవిధిచే నగ్నిని సంస్కరించి శ్రీసూక్తపంచదశ ఋక్కులతోను బంచదశాహుతులను ఘృతముతో వ్రేల్చి, పిమ్మటఁ బదునైదు ఋక్కులను అఖండ పారాయణము చేయవలయును.

రహస్యార్థము

¸R…VM $NSª«sVM xqsM = జ్ఞానానందస్వరూపిణియగు శ్రీసౌభాగ్యలక్ష్మీ నామకబ్రహ్మవస్తువు నపేక్షించువాఁడు; (భుక్తిముక్తలను గోరువాఁడు;) (''భక్తిమత్కల్పలతికా; భవరోగఘ్నీ ముక్తిదా'' యను దేవీనామములు సార్థకములని యెఱింగిన వాఁడు:) శుచిః, ప్రయతః = స్నానాదికముచే వెలిని, కామ క్రోధాదులు విడుచుటచే లోపలను బవిత్రుఁడై; అన్వహం = ప్రతిదినమును, ఆజ్యం = భేదవాసనల నెడి నేతిని;జుహుయాత్‌ = హోమము చేయవలయును.

ఈహోమమును శ్రీశంకరులు తమసౌందర్యలహరి యందెట్లు నుడివిరో చూడుఁడు ''శివాగ్నౌ జుహ్వంతః సురభి ఘృతధారాహుతిశ##తైః'' శివాగ్నౌ = శివాశక్తిః త్రికోణమితి యావత్‌. తత్రసంస్కృతః అగ్నిః శివాగ్నిః. త్రికోణ బైందవ స్థానే స్వాధిష్ఠానాగ్నిం అవయుత్య తత్ర నిక్షిప్య సురభిః కామ గనీ తస్యాః ఘృతం ఆజ్యం తస్యధారాభిః ఆహుతయః హవిః ప్రక్షేపాః తాసాం శతాని సహస్రం తైః''........

శివాగ్నియే సహస్రార కంజకర్ణిక యందలి త్రికోణము. అదే బైందవస్థానము. అక్కడ స్వాధిష్టానాగ్నినినెలకొల్పి కామధేనువుయొక్క, ఆజ్యమును:- ఆజ్యము కరఁగిన నేయి: ఘృతము గడ్డకట్టిన నేయి; ఘృతశబ్దముకంటెను ఆజ్యశబ్దమే యుక్తియుక్తము. ఏమనఁగా ఘృతమును విలాపనముచేసి ఆజ్యముగానైనపుడే హోమయోగ్యము. సహస్రారగత చంద్రమండలమున ఘనీభూతమై యుండు నమృతము ద్రవీభూతమగు నపుడే స్రుతమగును. అదె యీ ఆజ్యముగాఁ జెప్పఁబడినది. రహస్యార్థము, శివశక్తి సామరస్య రూపానందరసము. దీని నెడ తెగక స్రవింపఁజేయుటయే హోమము. యథార్థసమయాచార్యులు బాహ్యపూజాహోమములు చేయరు; వారు చేయునది, రహోయాగమనెడి ఆంతరయజ్ఞమే అనఁగా:--- ప్రాణాయాను ప్రయత్నముతోఁ బిండాండమందు మూలాధారకుహరమందుండు కుండలినీ పరాశక్తి పేరి శ్రీదేవిని మేల్కొల్పి యర్థమననపూర్వకముగా మంత్రబీజములను జక్రములందు నాదవిచ్ఛిత్తి కాకుండ న్యసించుకోనుచు జపించుచు, సహస్రాంశమునకుఁ గోంపోయి పరానందామృతమున నభిషేకించి తా నభిషేకింపఁబడుటయే రహోయాగము.

ఇందు, అవలంబింపఁదగు మంత్రము గాయత్రియే. అది కేవలసూక్ష్మ తరగాయత్రితోనే చేయవచ్చును. ప్రకట గాయత్రి నాల్గుపాదములతో సూక్ష్మతరగాయత్రి యనఁబడు పంచదశాక్షరి నాల్గు పాదములను జేర్చి జపించుట కోటిఫల ప్రదము. నివేదనవాక్యములందు సూచించితినిచూచునది. త్రివద గాయత్రిద్విజత్వ సిద్ధికై మాత్రమే చిననాఁడుపదేశించుట; లఘు దీక్షయనియు, శ్రీ విద్యామంత్రదీక్ష పూర్ణదీక్షయనియు, విశ్వామిత్ర కల్పమున వివరములు చూచునది.

లేదా లక్ష్మీమంత్రభేదములలో నేదేనోక మంత్రమును ఋక్కులకు సంపుటించియుఁ జేయవచ్చును.

లేదా ''ఓం ఈం నమః||'' అను మంత్రముతో సంపుటించి యైనను జేయవచ్చును. శ్రీం అను నేకాక్షరమనువుతో నైనను జేయవచ్చును.

లేదా, ఫలస్తుతి రూపవిశేష జ్ఞాపనమున నున్న రీతిని, ముందుగా మంత్రజపమును నేనీఋక్కు క్రింద వివరించిన రీతిని జపించి, అనఁగా, అమృతానుభూతి యనెడి యాజ్యహోమమును జేసి, యావెనుక పదునేను ఋక్కులను అర్థమనన పూర్వకముగాఁ బఠించుటయు మంచి విధానమే.

నా మతముచే ముందుగానే యర్థయుతముగా ఋక్కులను జపించి యాపైని మంత్రజపము చేయుట మేలు. ఏమన సాధకానుభవములు బుద్ధిని సంస్కరించి యుంచును. తరువాత సాధకుఁడు విద్యాజపము చేసెనేని రహోయాగక్రమమందు ఆ యనుభవములు అప్రయత్నముగా స్ఫురించుచుండుటకుఁ దోడ్పడి సాధకున కెంతో మేలు చేయును. తుదను మఱల ఋక్కుల నన్నింటిని అఖండముగా జపించవచ్చును.

సప్తశతీ సర్వస్వమందు అష్టావింశత్యక్షర (28 బీజములు గల) శ్రీకమలాలయామహాలక్ష్మీమంత్రముతో ఋక్కులను సంపుటించి జపించు విధానమును, బ్రత్యేకము ఋక్కులను జపించు విధములును, తత్తత్ఫలములును, విశదీకరింపఁబడ్డవి. అదియు క్షిప్రఫలప్రదమగుట మా కనుభూతము. అది చూచుకొనవచ్చును. తోడ నాగ్రంథము లేని వారును విధాన మన గతము కానివారును నావలన నెఱుగ వచ్చును.

కేవల బాహ్యపూజ తాదాత్మ్యాను సంధాన దూరము. ఆతాదాత్మ్మాను సంధానమె జీవన్ముక్తి.

''బాహ్యపూజా నకర్తవ్యాకర్తవ్యా బాహ్మాజాతిభిః |

సాక్షుద్రఫలదా నౄణాం ఐహికార్థైక సాధనాత్‌ ||

ఆంతరారాధనపరా వైదికా బ్రహ్మవాదినః |

జీవన్ముక్తాశ్చరం త్యేతే త్రిషు లోకేషు సర్వదాం ||''

అనిసనత్కుమార సంహిత. కావున ఆంతరోపాసనమే యాచరణీయము. మహానది నాశ్రయించిన వానికి స్నానపానవస్త్రధావనాదిక లాభము లన్నియు నెఱవేఱుటయు గాక తన క్షేత్రసస్యాది పోషణమహాలాభమును గలతుగునట్లు అంతరోపాసనాపరులకు భోగమోక్షకరీవిద్యా, యను మాట సార్థకముగా భుక్తిముక్తులు రెండును సులభములు.

కేవల బాహ్యార్చనమునే బోధించుచు ఐహికఫలదాన మాత్రముతోనే మొగము తుడుచునది. కాదీశ్రీఈసూక్తము. బాహ్యోపాసనము చేయకున్నను దాను బోధించు నాంతరోపాసనము వీడనపుడు ఐహికాముష్మిక ఫలప్రదమని మనవి చేయుచున్నాను.

ఉపనయనవేళఁ జేయఁబడు గాయత్రీమంత్రజపరూప బ్రహ్మోపదేశమును అంతర్యాగమే. ప్రాణాయామాది యోగ విశిష్టమైన శ్రీవిద్యయే యనుట నేఁడయిన మీబిడ్డలకుఁ దెలిపి, యాధ్యాత్మిక జ్ఞానసంపన్నులను జేసి కర్మభూమియైన భారతమునకుఁ దొల్లింటి విఖ్యాతిని దేఁజూతుడు గాక. అప్రాకృత శక్తిసంపన్నులను జేయుదురు గాక.

సంధ్యా దేవ్యుపాసన కగు మాటల తత్త్వమును చిన్న నాటినుండియు యథాధికారముగా బోధించుచున్న చో భోగ మోక్షప్రద శ్రీవిధ్యాసౌధాగ్ర భూమికకైన మెట్టు లెక్కించిన వారలగుదురు.

స్వార్థమందునుఁ బ్రమాదపడుటచేతనే, శ్రీసంపన్నమై వెలశిన దేశ మెన్నిదుర్గతులనో యనుభవించుచున్నది, అప్రమాదముతో నాచరింపఁబుట్టినవారును సప్రమాదులై చెడుచున్నారు. ఆయుధము లుండియుఁ బ్రయోగప్రయత్నము లేక త్రుప్పుపట్టించి, వేళకుఁబిరికతనమే కాన్పించు గేహే వీరులయి పరిహాసాస్పదు లగుచున్నారు. శ్రద్ధామాత్రమే మదింపుగా మహదైశ్వర్యముల ననుభవింపుడు.

లోకానుగ్రహముతో మహర్షులు ప్రసాదించిన మహానిధులు పూడిపోనీయక యించుక పరిశ్రమచేసి యధేచ్ఛగా ననుభవించి సర్వదారిద్ర్యములనుండి తొలఁగి సుఖింపుఁడు.

''ఇతః కొన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి ||

-మనువు.

భూమౌ స్ఖలితపాదానాం భూమి రేవావలంబనమ్‌ !

త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే||

మంగళం దిశతు మే వినాయకో

మంగళం దిశతు మే సరస్వతీ!

మంగళం దిశతు మే మహేశ్వరో

మంగళం దిశతు మే మహేశ్వరీ||

శ్రీ మహాత్రిపురసుందరీ పర దేవతార్పణమస్తు

ఇది

శ్రీశ్రియానందనాథుఁడు

శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మ

వ్రాసిన

శ్రీసూక్తరహస్యార్థ ప్రదీపిక సంపూర్ణమ్‌

Sri suktha Rahasyardha pradeepika    Chapters